శ్రావణమాసం వచ్చేసింది . ఇక పెళ్లిళ్లు , శుభకార్యాలు ఎక్కడ చూసినా సరే ఈ ఇన్విటేషన్ కార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి . అయితే శ్రావణమాసంలో ఎక్కువగా పూజలు , పెళ్లిళ్లు , శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు . దానికి తగ్గట్టే భోజనాలు కూడా పెడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భోజనాలలో ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారో అందరం చూస్తున్నాం.  ఏ పెళ్లికి వెళ్లినా సరే భోజనాల లిస్టు పెద్దగానే ఉంటుంది.  అయితే భోజనాల కోసం శుభకార్యాలు చేసే వాళ్ళు లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు . ఒక ప్లేట్ 300 నుంచి 500 లోపు ఉంటుంది . ఈ లెక్కన చూసుకున్న ఈజీగా లక్ష రూపాయలు వదిలి పోవాల్సిందే . అయితే కడుపు నిండా అన్నం పెడితే పుణ్యం వస్తుంది అంటూ ఎంత ఖర్చైనా భోజనాల దగ్గర వెనకడుగు వేయరు కొంతమంది జనాలు.


అక్కడికి భోజనాలు తినడానికి వచ్చిన వారు ప్లేట్లో పెట్టుకున్న ఐటమ్స్ అన్ని తింటున్నారా..? అంటే నో అని చెప్పాలి . ప్లేట్ నిండా అన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు కానీ తినేది మాత్రం రెండే. మిగతాదంతా డస్ట్ బిన్ లోకే వెళ్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు దగ్గర కాదు ఇలాంటివి మనం చాలా చాలా ఫంక్షన్స్ లో చూస్తూనే ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు అలానే చేస్తూ ఉంటాం. ఎవరైనా వచ్చి ఎందుకు అలా పడేస్తున్నావ్ అని అడిగితే ఫుడ్ బాగోలేదు అని .. రకరకాల రిజన్స్ చెప్తూ ఉంటాం . అయితే ఆ ఫుడ్ చేయడానికి ఎంత కష్టపడతారు ఫుడ్ పెట్టించిన వాళ్లు. డబ్బులు ఎంత కష్టపడి సంపాదిస్తారో అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉంటాం.

 

మన ఇంట్లో వండుకున్న ఆహారం ఏదైనా మిగిలిపోతే ఫ్రిజ్లో పెట్టుకుని పక్క రోజున తింటాం . కానీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అన్ని ప్లేట్ నిండా పెట్టించుకుంటాం.  కానీ ఫుడ్ మాత్రం పూర్తిగా తినం. కొందరు స్టైల్ కోసం మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు అనే జనాలు కూడా ఉన్నారు. ఇక శ్రావణమాసంలో ఎక్కువగా గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు , శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి . ఖచ్చితంగా భోజనాలు పెడతారు . ఫుడ్ అంతా కూడా  కొంచెం తిని కొంచెం పడేస్తారు . ఆ వేస్ట్ ఫుడ్ అంతా కూడా మనకి డస్ట్ బిన్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం ఇలా ఫుడ్ వేస్ట్ చేసే బదులు ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టుకొని మిగతాది ప్యాక్ చేసి రోడ్డు మీద తిండి కోసం అల్లాడిపోతున్న వాళ్లకి దానం చేస్తే పుణ్యం వస్తుంది కదా అంటున్నారు . కొంతమంది డబ్బున్న ఇళ్లల్లో 100 రకాల ఐటమ్స్ పెట్టి మొత్తం కూడా డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు అని .. అలా పడేయకుండా పేదవారికి ఇవ్వడం మంచిదేగా అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: