
ప్రతి ఏడాదిలో ఇది చివరి రెండవ చంద్రగ్రహణం ఈ గ్రహణం మనదేశంలో కూడా కనిపిస్తుంది.. సంపూర్ణ చంద్రగ్రహనాన్ని ఖగోళ అద్భుతంగా సైంటిస్టులు అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మికపరంగా కూడా ఈ గ్రహణం విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉందని పండితులు కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చంద్రగ్రహణం గురించి ప్రజలలో చాలా అపోహలు ఉండవచ్చు సందేహాలు భయాలు కూడా ఉండవచ్చు.. అసలు గ్రహణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందనే విషయం గురించి పండితులు ఇలా తెలుపుతున్నారు.
చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై అదే రాత్రి 11:42 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారుతుంది.తెల్లవారుజామున 1:26 కి గ్రహణం ముగుస్తుందని సుమారుగా 3గంటల 48 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం ఉంటుందని తెలుపుతున్నారు. ఈ గ్రహణాన్ని రాహు గ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తారు.. రాహువుతో చంద్రుడు కలిసినప్పుడు ఉద్భవించినటువంటి వాటిని చంద్రగ్రహణంగా పిలుస్తారు.
చంద్రగ్రహణం రోజున మానసికంగా బలంగా ఉండేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం మంచిదని పండితులు తెలుపుతున్నారు. గ్రహణం సమయాలలో గుడి కూడా మూసివేస్తారు. కాబట్టి ఇంట్లోనే దేవుడు ముందు కూర్చుని ధ్యానం , తపస్సు వంటివి చేయడం మంచిది. దీనివల్ల మానసిక బలం కూడా ఏర్పడుతుంది.
ఎవరైతే పసిపిల్లలు, గర్భిణీలు, ఉన్నారో గ్రహణ నియమాలను పాటించాలి. ముఖ్యంగా గర్భిణీలు చీకటి గదిలో ఉండేలా చూసుకోవాలి. భోజన సమయం కూడా సాయంత్రం ఏడు గంటలకే భోజనం చేయడం మంచిది. ముఖ్యంగా పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. ఆ మరుసటి రోజు గర్భిణి స్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్లి దర్శించుకోవడం చాలా ముఖ్యం.
గ్రహణం సమయంలో నీటిలోకి కొంత గరిక గడ్డి వేయడం కూడా మంచిది.
చంద్రగ్రహణ సమయంలో తలకి స్నానం చేయడం వల్ల ఆ గ్రహ దోషం పోతుందని పండితులు తెలుపుతున్నారు.
అలాగే చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజున నాగపడిక, వెండి, రాగి వస్తువులను దానం చేయడం మరింత మంచిది. లేకపోతే బియ్యం, మినుములు ఇవ్వడం కూడా చాలా మంచిది.