ఈటల రాజేందర్..తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు...మొన్నటివరకు కేసీఆర్ కు కుడి భుజంగా పనిచేసిన నేత...ఇప్పుడు అదే కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ నేత. లెఫ్ట్ భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఈటల 2003లో కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో తొలిసారి కమలాపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు...ఇక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి...2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు...ఆ ఉపఎన్నికల్లో పలువురు టీఆర్ఎస్ నేతలు ఓడిపోగా, మళ్ళీ కమలాపూర్ నుంచి ఈటల మాత్రం గెలిచారు.

ఇక 2009లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు..ఆ వెంటనే తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు...ఈ క్రమంలో 2010 ఉపఎన్నికలు వచ్చాయి..ఆ ఉపఎన్నికల్లో ఈటల మళ్ళీ గెలిచారు...ఇక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో మరోసారి హుజూరాబాద్ నుంచి ఈటల గెలిచి, కేసీఆర్ క్యాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు...2018లో కూడా మరొకసారి గెలిచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు...కానీ 2021లో ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించడం, ఈటల వెంటనే టీఆర్ఎస్ ని వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.

 
అయితే కేసీఆర్ రాజకీయంగానే ఈటలని పార్టీ నుంచి సైడ్ చేశారని చెప్పుకోవచ్చు..అలా పార్టీ నుంచి బయటకొచ్చిన ఈటల...బీజేపీలో చేరి...మరొకసారి హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసి అదే టీఆర్ఎస్ పై మంచి మెజారిటీతో గెలిచారు..ఇలా హుజూరాబాద్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు...ఇక మంత్రిగా, ఎమ్మెల్యేగా హుజూరాబాద్ కు ఈటల చాలానే చేశారు...అందుకే ఉపఎన్నికల్లో ఆ ప్రజలే గెలిపించారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఈటలకు తిరుగు ఉండదనే చెప్పొచ్చు. మరి ఈసారి టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారో లేక కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారో క్లారిటీ లేదు...మరి ఈ సారి ఈటల గెలుపుని ఎవరైనా ఆపుతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp