ఏపీలో మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆనం రాం నారాయణ రెడ్డి ఒకరు. టి‌డి‌పిలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆనం... నెల్లూరు జిల్లా రాపూర్(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 1994 ఎన్నికల్లో అదే రాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో రాపూర్ నుంచి గెలిచిన ఆనం 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా తయారైన క్రమంలో, 2014 ఎన్నికల తర్వాత ఆనం టీడీపీలోకి వచ్చేశారు. నాలుగేళ్ళ పాటు టీడీపీలో గడిపిన ఆనం....2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి, ఆ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు....కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా ఆనంకు మంత్రి పదవి రాలేదు. అయితే ఈ సారి విడతలో కూడా ఆనంకు పదవి వచ్చేలా లేదు.

ఇప్పటికే ఆనం...సొంత పార్టీకి చెందిన పలువురు నేతలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అధికారులు తన మాట వినడం లేదని, తన నియోజకవర్గంలో అభివృద్ధి చేయట్లేదని మాట్లాడారు. ఈ కోణంలో చూస్తే ఆనంకు పదవి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఇటీవల ఆనం ఫ్యామిలీకి చెందిన ఆనం అరుణమ్మకు నెల్లూరు జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కాబట్టి ఆనంకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.


ఇక ఎమ్మెల్యేగా ఆనం మంచిగానే పనిచేసుకుంటున్నారు...ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు వెంకటగిరిలో అమలు అవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. టి‌డి‌పి నేత కురుగొండ్ల రామకృష్ణ ..పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆనంకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో వెంకటగిరి ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: