తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార ఇప్పుడు  దర్శకులు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట.  సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత గజినీ చిత్రంతో హాట్ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది.   ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తక్కువ కాలంలో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. తెలుగు లో బాలకృష్ణతో నటించిన సింహ, శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  
Image result for nayanthara simbu
ఈ అమ్మడు సినిమా కెరీర్ లో ఎంత బెస్ట్ అనిపించుకుందో..రియల్ లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీస్ కి కేంద్ర బింధువువైంది.  తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపించి లిప్ లాక్ తో వీరి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  ఆ తర్వాత  దర్శకుడు, నటుడు ప్రభుదేవతో దాదాపు పెళ్లి వరకు వచ్చిన మ్యాటర్ తర్వాత పెటాకులైంది.
Image result for nayanthara prabhu deva
ఆ తర్వాత సినిమాలపై దృష్టి కేంద్రీకరించిన ఈ అమ్మడు ఒక్కసారిగా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం నయన్  దర్శకులు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉండటం..వీరిద్దరూ తెగ షికార్లు కొట్టడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే గతకొంతకాలంగా కలిసే ఉంటున్నారు.  భార్యాభర్తల్లాగే ఏ ఫంక్షన్ లు జరిగినా ఇద్దరూ జంటగా వెళుతున్నారు..పండగలు కూడా చేసుకుంటున్నారు.  
Image result for nayanthara vignesh
అయితే వీరిద్దరి భాగోతం చూసి ఇండస్ట్రీ వర్గం పెళ్లి కాకుండానే భలే ఎంజాయ్ చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. నయన్ మాత్రం ఇలా ఎంతకాలం సాగితే అంత కాలం కలిసే ఉంటామని అంటున్నారు.  గతంలో పెళ్లి దాక వచ్చిన మ్యాటర్ బెడిసి కొట్టిన విషయం దృష్టిలో ఉంచుకున్న నయన్ కొంత కాలంగా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటుందా అని అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: