డైరెక్టర్ శైలేష్ కొలను తన మొదటి మూవీ "హిట్" తో ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఇదే మూవీను హిందీలో రాజ్ కుమార్ రావ్తో తెరకెక్కించనున్నారు. ఇది నిజంగా గ్రేట్ న్యూస్. 

శైలేష్ కు హిందీలో "హిట్" మూవీను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను ఇచ్చాడు దిల్ రాజు. శైలేష్ లోని టాలెంట్ ను గమనించి ఈ అవకాశం ఇచ్చారని ఫిలిం నగర్ లో టాక్. మొత్తానికి ఓ కొత్త డైరెక్టర్ కు మొదటి అవకాశంలోనే బాలీవుడ్ మూవీను కూడా డైరెక్ట్ చేసే అవకాశం రావడం మాత్రం ఎంతో గొప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

శైలేష్ రీసెంట్ గా మళ్ళీ దిల్ రాజును ఇంప్రెస్ చేశాడట. ఓ స్క్రిప్ట్ ను నేరేట్ చేశాడట శైలేష్. దీంతో, దిల్ రాజు ఈ స్క్రిప్ట్ కు స్టార్ హీరోనే సూట్ అవుతాడని ఫిక్స్ అయ్యాడట. ఎన్టీఆర్ అయితేనే ఈ స్క్రిప్ట్ కు న్యాయం చేయగలదని దిల్ రాజు భావిస్తున్నాడు. వెంటనే, ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తవగానే ఎన్టీఆర్ ఇక శైలేష్ సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమైతే, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వర్క్స్ పూర్తయ్యేంతవరకు వేరే ఏ సినిమాలోనూ కనిపించలేడు. అంటే, 2021 తరువాత ఒకవేళ ఇంకా డిలే ఐతే ఆ తరువాతే ఈ స్టార్ హీరోతో శైలేష్ కి సినిమా ఛాన్స్ దక్కుతుంది. అంటే, ఆలస్యమవవచ్చు గానీ బంపర్ ఆఫర్ మాత్రం వరిస్తుంది అనడంలో సందేహం లేదు. 

హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించాడు. నానీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. నానీ హిట్ సినిమాకు సీక్వల్ తీయాలని కూడా అనుకుంటున్నాడు. ఐతే, అందులో అడవి శేష్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి హిట్ సినిమా అనేది శైలేష్ కొలను కెరీర్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిందనే చెప్పుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: