సూపర్ స్టార్ రజనీకాంత్ కు నిన్న కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ అవార్డు ప్రకటించటం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తోంది. సాధారణంగా సినిమాలకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే అక్కడ ముఖ్యమంత్రులు అందరూ దాదాపుగా సినిమాలతో సంబంధం ఉన్నవారే ఉంటారు. 

ఇప్పుడున్న పళనిస్వామి కి సినిమాలకు సంబంధం లేదు కానీ ఆయన సీఎం అయ్యే ముందు వరకు పనిచేసిన జయలలిత వరకు దాదాపు అందరూ సినిమాలతో ఏదో ఒక రకంగా సంబంధం ఉన్న వారు ఉండేవారు. అయితే రజనీకాంత్ కు ఇప్పుడు అవార్డు ఇవ్వడంతో తమిళ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతారు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే వాస్తవానికి మరికొందరు మరో రకమైన విశ్లేషణ చేస్తున్నారు. అదేమిటంటే గత ఏడాది చివర్లో రజినీకాంత్ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అంతా సిద్ధం అయిపోయింది ఇక పార్టీ ప్రకటన చేసే తేదీ కూడా ముందే ప్రకటించారు. 

ఈ లోపు రజనీకాంత్ అనారోగ్యం బారిన పడడం  హుటాహుటిన ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చడం అందరికీ తెలిసిందే. అయితే అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అయినా రాజకీయ పార్టీ ప్రకటిస్తాడని అందరూ అనుకుంటూ కానీ అందరికీ షాక్ ఇస్తూ ఆయన రాజకీయాలకు దూరమవుతున్నా అని ప్రకటించాడు.. అయితే అప్పుడు ఆయన ప్రకటన వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదించారు. ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడంతో ఆ వాదన నిజమే అని సదరు వర్గం వారు గుర్తు చేస్తున్నారు. పార్టీ పెట్టకుండా బీజేపీకి మేలు చేయడంతో ఆయనకు ఈ అవార్డ్ అందించారని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: