తెలుగులో సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శంకరాభరణం. ఫిబ్రవరి 2 1980లో ఈ సినిమా రిలీజ్ అయింది.. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఏడిద నాగేశ్వరరావు ఆకాశం శ్రీరాములు సంయుక్తంగా నిర్మించారు. శాస్త్రీయ సంగీతం కనుమరుగైపోతున్న రోజుల్లో ఈ సినిమా విడుదల కావడంతో చాలా మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కె విశ్వనాధ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. 

శంకర శాస్త్రి గా నటించిన జె.వి.సోమయాజులు గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయన కచేరీ ఒకసారి విన్న ఒక వేశ్య కూతురు, నర్తకి అయిన తులసి పాత్రలో నటించిన మంజుభార్గవి ఆ వేశ్యా వృత్తిని అసహ్యించుకుంటుంది. శంకర శాస్త్రి మీద గురు భావంతో ఆయనని ఏకలవ్య శిష్యురాలుగా ఆరాధిస్తుంది. అయితే తన వద్దకు వచ్చిన ఒక విటుడు బలాత్కరించి శంకరశాస్త్రిని అనేక మాటలు అంటూ ఉంటే దాన్ని భరించలేక అతని హతమారుస్తుంది. ఆ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకరశాస్త్రి అండగా నిలిచి తీసుకువచ్చి ఆశ్రయం ఇవ్వగా ఒక వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్నచూపు చూస్తారు. 

దీంతో మంజుభార్గవి బయటకు వెళ్లిపోతుంది. ఆ తరువాత సంగీతాన్ని ఆమె ఎలా నేర్చుకుంది ? సంగీతం నేర్చుకోవడం కోసం ఏం చేసింది ? అనే అంశం మీద ఈ సినిమాను ఎక్కించారు. ఈ సినిమాకు కే.వి.మహదేవన్ ఇచ్చిన సంగీతం బాగా నప్పింది. అలాగే జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ గానం, సోమయాజులు మంజుభార్గవి అల్లు రామలింగయ్య తదితరులు నటన అన్నీ కలిపి శంకరాభరణం అనగానే ఒక క్లాసిక్ సినిమా అనే భావన తీసుకొస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: