
90లలో హీరోయిన్ లను అభిమానులు ఎలా పోగిడేవారు అంటే వారికి అసలు పేర్లు ఉన్న కూడా టాగ్ నేమ్ లతో వారిని పిలుస్తూ వారిని ఆకాశానికి ఎత్తేసేవారు. ఇక అప్పటి హీరోహీరోయిన్ల కాంబినేషన్ కి కూడా ఎంతగానో అభిమానులు ఉండేవారు. చిరంజీవి మీనా కాంబినేషన్ కు, చిరంజీవి నగ్మా కాంబినేషన్ కు , చిరంజీవి రమ్యకృష్ణ కాంబినేషన్ కు విపరీతమైన అభిమానులు ఉండేవారు. వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాలను ఎంతగానో అభిమానించేవారు. చిరంజీవనే కాకుండా ఇతర హీరోలతో ఈ కథానాయకలు చేసే సినిమాలను ప్రేక్షకులు అలరించేవారు.
మీనా నగ్మా రమ్యకృష్ణ లాంటి కథానాయికలతో కింగ్ నాగార్జున రొమాన్స్ కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. సదరు నాయికిల కాంబో లలో నాగ్ కు బంపర్ హిట్లు వచ్చాయి. అయితే నాటి రోజుల కు జ్ఞాపకంగా క్లాసిక్ అనదగ్గ ఫొటోగ్రాఫ్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 90లలో అగ్ర హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున ఆ ఇద్దరు కలిసి నటించిన అందాల కథానాయికలైన రమ్య కృష్ణ, నగ్మా, మీనా క్లాసిక్ ఫోటోగ్రాఫ్ లో ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు దీనిని వైరల్ చేస్తున్నారు.ఆయా హీరోల అభిమానులు ఈ ఫోటో లో తమ హీరో చాలా బాగున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.