ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో బహుశా పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడు ఎవరూ వచ్చి ఉండరేమో. ఎందుకంటే ఇతను సినిమా తీసే విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తెలుగు సినిమా ప్రేక్షకులు పూరీ సినిమాలు అంటే పడి చస్తారు. పూరి సినిమాలలో డైలాగులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే నమ్మండి. ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ కెరీర్ లో వచ్చిన సినిమాలలో తనకి దర్శకుడిగా మరియు కమర్షియల్ గా మంచి పేరు తీసుకు వచ్చిన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

బద్రి

పూరి దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి సినిమా. ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇందులో పవన్ మరియు ప్రకాష్ రాజ్ మధ్యన వచ్చే సన్నివేశాలు మరియు డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే రేణు దేశాయ్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత పవన్ మరియు రేణు లమధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లింది.  

ఇడియట్

సినిమా 2002 లో విడుదల అయింది. ఇందులో రవితేజ మరియు రక్షిత హీరో హీరోయిన్ లుగా నటించారు. చంటి అనే ఒక లవర్ పాత్రను చూపించిన విధానం మరియు అతను తన ప్రేమను సాధించుకున్న విధానం అద్బుతం. ఇందులో పోలీస్ కమిషనర్ కూతురిని ప్రేమించి అతనినే ఢీ కొట్టే పాత్రలో రవితేజ నటన ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ సినిమా అటు రవితేజకు మరియు పూరీ జగన్నాథ్ కు మంచి పేరును తీసుకు వచ్చింది.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం మరియు అమ్మ నాన్నతమిళ అమ్మాయి

ఈ రెండు సినిమాలు కూడా ఒక మంచి ప్రేమకథలుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి రీచ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలలో రవితేజను చూపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఒక కిక్ బాక్సర్ గా అమ్మ నాన్నతమిళ అమ్మాయి చిత్రంలో తండ్రినే ఎదిరించే పాత్రలో రవితేజ నటన అద్బుతం.

పోకిరి

ఈ సినిమాలో మహేష్ బాబు మరియు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో పూరి జగన్నాధ్ తన దర్శకత్వ ప్రతిభను పూర్తిగా వాడేశాడని చెప్పాలి. ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ సరిగ్గా కలిసి వచ్చాయి. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇందులో మహేష్ చెప్పే కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ ప్రజల గొంతుల్లో నానుతున్నాయి.

దేశముదురు

అప్పుడప్పుడే హీరోగా స్థిరపడుతున్న అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ హిట్ తీశాడు. కథ బాగుంటే పెద్ద హీరో అవసరం ఎల్దాని ఈ సినిమాతో నిరూపించాడు పూరి. ఇందులో పాటలు, డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

బిజినెస్ మ్యాన్

మహేష్ తో రెండవ సారి తీసిన సినిమా ఇది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం రికార్డు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉచ్చ పోయించాడు. హాల్ అంతా దద్దరిల్లిపోయింది మహేష్ దెబ్బకు.

టెంపర్

సినిమా వచ్చేంత వరకు ఎన్టీఆర్ ఇలాంటి కథతో వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అదే పూరి జగన్నాధ్ స్పెషల్. ఎంత హీరోను అయినా తన కథలో కలిసిపోయేలా చేస్తాడు. ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ ను చూపించిన విధానం. చివర్లో సెంటిమెంటల్ సీన్స్ సినిమాను ఎక్కడో నిలబెట్టాయి. ఈ సినిమా ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా టాలీవుడ్ లో రికార్డు సృష్టించింది.

ఇస్మార్ట్ శంకర్

రామ్ కు సరైన టైం లో హిట్ అందించి తన కెరీర్ కు ప్రాణం పోశాడు. సరికొత్త కథను డీల్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాతనే పూరి కష్టాల నుండి గట్టెక్కాడు. ఈ సినిమాను పూరి మరియు ఛార్మి కలిసి నిర్మించారు.

ఇలా పూరి జగన్నాధ్ కెరీర్ లో ఈ సినిమాలు తనకు అన్ని విధాలుగా మంచి పేరును తీసుకువచ్చాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: