మాస్ మహారాజ రవితేజ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన సినిమా 'విక్రమార్కుడు'. రవితేజ నటించిన ఈ సినిమా ఎవరి ఊహకి అందనంత మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అప్పుడు రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా ఇప్పుడు రాబోతుంది. సీక్వెల్ అయితే వస్తుంది కానీ అది తెలుగులో కాదు. హిందీలో విక్రమార్కుడు సినిమా ని అక్షయ్‌కుమార్‌తో 'రౌడీ రాథోడ్‌'గా రీమేక్‌ చేసేసారు. ఇది ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాతగా పని చేశారు. అయితే ఇందులో కూడా ఈ చిత్రం అనుకున్నంత మంచి విజయాన్ని సాధించగలిగింది.

సినిమా హిందీ లో మంచి విజయాన్ని అందుకోవడంతో  ఈ సినిమాకు సీక్వెల్ గా 'రౌడీ రాథోడ్‌-2' తీసేందుకు  సిద్ధంగా ఉన్నారట. అయితే విక్రమార్కుడు సినిమా కథను దర్శకుడు రాజమౌళి తండ్రి అందించడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ తయారుచేసే పనిలో ఉన్నారట. అయితే స్వయంగా తానే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.రౌడీ రాథోడ్ 2 కోసం విజయేంద్ర ప్రసాద్ ను ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ సంప్రదించారట.దీంతో విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రిప్ట్ రాసివ్వడానికి ఒప్పుకున్నాడట.కాగా రౌడీ రాథోడ్ కథకి కొనసాగింపుగా కాకుండా..

ఈసారి ఒక కొత్త కథతో ఈ సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా పాత్రలు మాత్రం అలాగే ఉంటాయట.ఇక వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.అటు మరోవైపు సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయీజాన్' సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించారు.ఈ సినిమాకి కథను అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే.త్వరలోనే భజరంగ్ భాయిజాన్ 2 కోసం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయనున్నారట. మొత్తం మీద విక్రమార్కుడు సీక్వెల్ తెలుగులో కాకుండా ముందు హిందీలో తెరకెక్కబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: