కొన్ని సినిమాలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా క్రేజ్ మాత్రం రాదు. అందులోనూ హీరో సపోర్ట్ చేయనీ సినిమాలకు క్రేజ్ రావడం అంటే నిజంగా చాలా కష్టమనే చెప్పాలి. ఎలాగోలా తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది హీరోలు మాత్రం ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయరు ఆ విధంగా రవితేజ ఖిలాడి సినిమా కు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన విడుదల ఫిబ్రవరి 11వ తేదీన ఉంది.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ స్థాయిలో ఇమేజ్ కలిగి ఉన్న ఈ హీరో సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ ట్రైలర్ టీజర్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అందరినీ ఆసక్తి పరుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి హీరో సపోర్ట్ చేయకపోవడం ఒకింత అందరినీ ఆశ్చర్యంగానే కూర్చుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎంతైనా హీరో సపోర్ట్ చేసి తన సినిమాకు కలెక్షన్లు వచ్చే విధంగా చేసుకోవాలి అలాకాకుండా చేస్తే మాత్రం తప్పకుండా ఆ హీరో కి బ్యాడ్ నేమ్ వస్తుంది. 

ఇప్పుడు రవితేజ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన అభిమానులను మాత్రం భారీగా నిరాశ పరుస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తొందర్లోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఆయన ప్రస్తుతం రావణాసుర అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఆ తరువాత ధమాకా అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి రవితేజ మీరు చేస్తున్న ఈ ఖిలాడి సినిమా ఏ విధమైన సక్సెస్ను సాధించి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు కాగా డింపుల్ హయథి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: