టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా ఇంకా రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఖిలాడి.మొదటి రోజే ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకొని నిరాశ పరిచింది.అందువల్ల ఈ సినిమాకు వసూళ్లు అసలు ఊహించినంతగా రావడం లేదు.

ఫస్ట్ డే కాస్త తక్కువ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి కూడా అదే చేస్తుంది. ఇక మూడు నాలుగు రోజుల్లో అయితే మరింత దారుణంగా కలెక్షన్స్ పడిపోతున్నాయి. నాలుగో రోజు కోటి కంటే తక్కువగా వచ్చాయి వసూళ్లు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేవలం 87 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఖిలాడి సినిమా. ఇప్పటికే చాలా చోట్ల ఖిలాడి సినిమా వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. క్రాక్ సినిమా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చినా.. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో ఖిలాడి సినిమా ఫెయిల్ అయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తేడా కొట్టడంతో సినిమా కూడా తేడా కొట్టేసిందంటున్నారు ఆడియన్స్. ఈ సినిమాతో వరసగా రెండో హిట్ కొట్టాలని కలలు కన్న రవితేజకు పాపం అవి కలలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి.

డింపుల్ హయాతీ ఇంకా మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఖిలాడి సినిమాలో స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటంతో సినిమాకు అదే మైనస్ అయిపోయింది. ఇక ఈ  ఖిలాడి సినిమాకు 4 డేస్‌లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇవే..

నైజాం 3.27 కోట్లు
సీడెడ్ 1.33 కోట్లు
ఉత్తరాంధ్ర 1.13 కోట్లు
ఈస్ట్ గోదావరి 0.61 కోట్లు
వెస్ట్ గోదావరి 0.51 కోట్లు
గుంటూరు జిల్లా 0.90 కోట్లు
కృష్ణా జిల్లా 0.46 కోట్లు
నెల్లూరు జిల్లా 0.42 కోట్లు
ఏపీ ఇంకా తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 8.63 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక కలెక్షన్స్ 0.71 కోట్లు
ఓవర్సీస్ కలెక్షన్స్ 0.40 కోట్లు
హిందీ కలెక్షన్స్ 0.30 కోట్లు
వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్10.04 కోట్లు

ఇక ఖిలాడి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కూడా రూ.23 కోట్ల బిజినెస్ జరిగింది. రవితేజ కెరీర్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ అంటే ఈ సినిమానే. క్రాక్ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఖిలాడి సినిమాకు బిజినెస్ అనేది బాగానే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఖిలాడి సినిమాకు జరిగిన బిజినెస్‌ చాలా దూరంలోనే ఆగిపోయేలా కనిపిస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి దాకా ఈ చిత్రం కలెక్షన్స్ 10.04 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 13 కోట్లకు పైగా రాబడితే ఈ సినిమా సేఫ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: