టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈమధ్యే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.#NBK107 సినిమాతో ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. టాలెంటెడ్ యాక్టర్ ఇప్పటికే ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు.ఇక ఈ నేపథ్యంలో తాజాగా దునియా విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.ఈ పోస్టర్ లో భయం అంటే తెలియని ప్రతినాయకుడు ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గా భయంకరమైన గెటప్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ పోస్టర్ ని బట్టి పూర్తిగా అర్థం అవుతుంది.


వాస్తవ సంఘటనల ఆధారంగా #NBK107 సినిమాని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇందులో బాల కృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మైనింగ్ ఏరియాలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని.. పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి బాల కృష్ణ ఎంతో స్టైలిష్ గా కనిపించారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. #NBK107 కోసం కొంతమంది అగ్రశ్రేణి నటీనటులు ఇంకా అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే ప్రముఖ మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా ఇంకా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అలాగే సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: