హీరో నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 18 పేజస్. ఈ సినిమాని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కుమారి 21-F సినిమాని నిర్మించిన సూర్య ప్రతాప్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే అందించడంతోపాటు గా నిర్మాణ రంగంలో కూడా భాగం పంచుకున్న ట్లు తెలుస్తోంది. ఇందులో హీరో నిఖిల్ సరసన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

సుకుమార్ ఒక వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో ఈ సినిమా కథని అందించినట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉన్నది. కేవలం ఈ సినిమా 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా లవ్ స్టోరీ పూర్తిచేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గా మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా చేస్తున్నారు. నిజానికి 18 పేజేస్ సినిమా ఈ గతేడాది ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడడం జరిగింది.

ఇక ఈఏడాది జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేదానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే రోజున హీరో రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ బుధవారం రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది.18 పేజేస్ చిత్రాన్ని GA 2 పిక్చర్స్ మరియు సుకుమార్ బ్యానర్ పై ఈ సినిమాని బన్నీ వాసుదేవ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ ఎడిటింగ్ వర్క్ ఈ సినిమాకి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: