సమంత విడాకుల తర్వాత వరుస సినిమాల ను చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన పుష్ప సినిమాలో అదిరిపొయె ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ పాటకు తగ్గట్లే ఊ అంటావా మావ అంటూ సాగిన పాట రికార్డులను అందుకుంది. సినిమాకు ఈ పాట హైలెట్ గా నిలిచింది..సినిమా విడుదల అయ్యి నాలుగు నెలలు అయిన కూడా పాట ఇంక వినిపిస్తుంది.. తర్వాత వరుస సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది. ఒక వైపు సినిమాలతో బిజిగా ఉన్న కూడా సామ్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా వుంటుంది. టూర్ లు వేస్తూ ఎంజాయ్ చెస్తుంది..


సామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా యశోద.. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. హరి - హరీష్‌ కొత్త దర్శకులుగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. ఇందులోని కీలక సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా రానుందని చిత్రయూనిట్ వెల్లడించారు.. సామ్సినిమా లో ఎలా కనిపిస్తుంది అనే ఆసక్తి అభిమానులకు కలుగుతుంది.. సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు..


ఇది ఇలా ఉండగా సామ్ అభిమానులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''సమంత నటన, ఆమెపై తెరకెక్కించిన యాక్షన్‌ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు..హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశాం. అందులో చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం కొడైకెనాల్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలెట్టాం. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌రాజ్‌, శత్రు తదితరులు ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: