
ఇక ఇందులో అఘోరా గెటప్‌లో బాలయ్య, త్రిశూలం చేతిలో పట్టుకుని తాండవం ఆడుతూ, తన ఉగ్రరూపాన్ని చూపుతూ కనిపించారు. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. డిసెంబర్ నెలను సినిమా బాక్సాఫీస్ కోసం ఫ్రూట్‌ఫుల్ సీజన్గా పరిగణిస్తారు. గతేడాది అదే తేదీకి రిలీజైన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రూల్ చేసింది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది అదే డేట్ కోసం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ చివరికి సంక్రాంతి సీజన్‌కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు బాలయ్య ‘అఖండ 2’ తో ఈ డేట్ ఖరారు చేయడం, అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది.
ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు ‘పుష్ప 2’ రిజల్ట్ రిపీట్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కమ్బినేషన్ గతంలో సూపర్ హిట్ ఫిల్మ్స్ను అందించగా, ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా మాస్, యాక్షన్, డ్రామా, విజువల్ ఫీస్్ట్ కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టేలా ఉంటుంది. ‘అఖండ 2’ డిసెంబర్ 5 నుండి పాన్ ఇండియా హంగామా కోసం సిద్ధం అవుతుంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశారు. బాలకృష్ణ యాక్షన్, మ్యాజిక్, మాస్ యూనిక్ ఫీలింగ్ ను తెరపై చూపించబోతున్నారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ రిపోర్ట్స్, రివ్యూస్ కోసం పాన్ ఇండియా థియేటర్లే హాట్ స్పాట్‌గా మారనుండగా, ‘అఖండ 2’ డిసెంబర్ సీజన్‌లో బ్లాక్‌బస్టర్ రీజల్ట్ ఇవ్వగలదా అనే ఉత్కంఠ ఇప్పుడు హైప్‌లో ఉంది.