దర్శక ధీరుడు రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , రాజమౌళి తన కెరియర్ లో ఒక్క అపజయం కూడా లేకుండా బ్లాక్ బాస్టర్ విజయాలతో ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు.  ఇండియా లోనే టాప్ దర్శకులలో ఒకరు గా ఎదిగిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా  తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ , ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా నటించారు . ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ మూవీ మార్చి  25 వ తేదీన విడుదల.అయ్యింది,  ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ కు చేరుకున్నాడు, ఆదిలాబాద్ జిల్లాలోని జన్కపురంలో  లో పిచ్చర్ ట్యూబ్ సంస్థ ఎయిర్ ఏర్పాటుచేసిన గాలి బుడగల థియేటర్ ను సందర్శిస్తారు అని చెప్పిన రాజమౌళి,  నిన్న ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు పయనం  అయ్యారు.  రాజమౌళి కి జిల్లాలోని ఆదివాసులు కొమరంభీం వారసులు ఘన స్వాగతం పలికారు,  ఆదివాసి గుస్సాడీ నృత్యాలతో సాంప్రదాయబద్దంగా దర్శకుడు రాజమౌళి కి స్వాగతం పలికారు.  జిల్లా అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సమైక్య సంఘం సభ్యులు కొమురం భీం ఫోటో కు నివాళులు అర్పించి,  అనంతరం జిల్లా కేంద్రంలో మహిళా జిల్లా సమాఖ్య ఆధ్వర్యం లో నిర్మించిన పిక్చర్ ట్యూబ్ మూవీ థియేటర్ ను సందర్శించిన దర్శకుడు రాజమౌళి అందులోనే ప్రేక్షకులతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాను వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: