బాలీవుడ్ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు లో వరుస పెట్టి సినిమాలో చేస్తున్న నటి మణులలో జాన్వి కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా కాలం క్రితమే హిందీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. హిందీ సినిమాల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈమెకు హిందీ సినిమాల ద్వారా భారీ స్థాయి విజయాలు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది.

మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు కెరియర్ లో మొట్ట మొదటి సారి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే మరో భారీ బడ్జెట్ తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇకపోతే తాజాగా జాన్వి కపూర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రామ్ చరణ్ పై ఈమె ప్రశంసల వర్షం కురిపించింది. తాజా ఇంటర్వ్యూ లో జాన్వి కపూర్ మాట్లాడుతూ ... రామ్ చరణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన స్టార్ హీరో ఆయన కూడా అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఆయన సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని జాన్వి కపూర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: