టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ గా చలామణి అయిన ప్రగతి ఇప్పుడు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యింది. ప్రగతి తన డాన్స్ తో అలాగే తన బాడీ స్ట్రక్చర్ తో తన ఏజ్ ను కూడా గుర్తుపట్టలేనంతలా మారింది.

ఒకప్పుడు ఎంతోమంది హీరోయిన్లకు హీరోలకు అమ్మగాను పిన్నిగాను ఇలా ఎన్నో క్యారెక్టర్ లో లీనమైపోయి నటించింది ప్రగతి. ఇటీవల ఎఫ్2 సినిమాలో ఆమె నటనను చూసి అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాలో తన నటన చూసి అందరూ ఆకర్షితులయ్యారు. ఇదిలా ఉండగా ప్రగతి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు హాజరయ్యింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె నోటి గుండా చెప్పిందట..

 

ప్రగతి తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారట. అయినా అది కుదరకపోవడంతో తన భర్తతో విడాకులు తీసుకుందట. ఇక తన పిల్లలను ఎంతో కష్టపడి చదివించానని ఇప్పుడు వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చారని చెప్పింది. ఇక చాలా ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నానని .. అప్పట్లో నగలను తాకట్టు పెట్టి.. ఆ సమస్య నుంచి గట్టెక్కడం జరిగింది. ఎవరికైనా కష్టం వస్తే వారి కుటుంబం వారికి తోడుగా అండగా ఉంటుంది. అలాగే నాకు కూడా నా కుటుంబం కష్టాలలో తోడుగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ జరిగిపోయిన దానిని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం అని ప్రగతి చెప్పుకొచ్చిందట.. ఇది ఎలా ఉండగా ప్రగతి సినిమాల్లో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రగతికి సోషల్ మీడియాలో లక్షల కొద్దీ అభిమానులు అయితే ఉన్నారు.

 
నటి ప్రగతి జీవితంలో ఎన్ని సంఘర్షణలు ఎదురైనప్పటికీ సంతోషంగా వాటిని నెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం అభిమానులను అలరిస్తూ మరింత దగ్గరయ్యింది. అందుకే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుందట ప్రగతి. మొత్తానికి యువత ఎక్కువగా ఈమెను ఇష్టపడుతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: