మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుష్క శెట్టి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కమర్షియల్ మూవీ లలో హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఫీదా చేసిందో , అలాగే అద్భుతమైన కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించి తన నటన తో కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే అనుష్క  , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అనుష్క "నిశ్శబ్దం" అనే మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ప్రస్తుతం యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక మూవీ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అనుష్క శెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనుష్క చాలా స్లిమ్ గా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ని మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అనుష్క , నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: