బుల్లితెర టీవీ షో ల ద్వారా అత్యంత ప్రజాదరణను సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటు వంటి సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుదీర్ "జబర్దస్త్" కామెడీ షో ద్వారా అద్భుతమైన కమీడియన్ గా గుర్తింపు ను తెచ్చుకొని , ఆ తర్వాత ఎన్నో షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్నాడు. అలాగే సుధీర్ , టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా , ఎన్నో సినిమా లలో నటించి కూడా ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సుదీర్ "సాప్ట్ వేర్ సుధీర్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ "గాలోడు" అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ఆర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను కాస్త ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ కలెక్షన్ లు లభించాయి.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
 నైజాం : 36 లక్షలు .
సీడెడ్ : 18 లక్షలు .
ఆంధ్ర :  47 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు గాలోడు మూవీ 48 లక్షల షేర్ , 1.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా గాలోడు మూవీ మొదటి రోజు దాదాపుగా 1.04 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: