తెలుగు మాస్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు చాలా బిజీ అయ్యాడు..సినిమాలు మాత్రమే కాదు షో లలో కూడా సందడి చేస్తున్నారు.. మొన్నీమద్య వచ్చిన అఖండతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ప్రస్తుతం ఈయన కొత్త డైరెక్టర్ గోపిచంద్ మలినెని దర్సకత్వమ్లొ సినిమాను చేస్తున్నారు... ఆ సినిమానే 'వీరసింహారెడ్డి'.. వీరసింహారెడ్డి కోసం నందమూరి అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది..


సినిమా పాటు సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు బాలయ్య. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ జైలు సెట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో తాజాగా టీమ్ మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కి వెంకట్‌ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ షెడ్యూల్‌ లో బాలకృష్ణ, వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు మరికొందరు ఆర్టిస్ట్ లపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు..


అదే విధంగా సెట్ లోనే #NBK108 యూనిట్ నూతన సంవత్సర వేడుకలని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు..ఆయన మరో లెవల్ లో కనిపించనున్నారు.. హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ టోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు..అన్  స్టాపబుల్ షో చెస్తున్నారు. సినిమా కన్నా ఎక్కువ పేరును తీసుకు వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: