నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితమే బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలా అఖండ మూవీ సక్సెస్ తర్వాత తాజాగా బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీలో హీరోగా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యి  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాల తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరణ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రియమణి హీరోయిన్ గా నటించబోతున్నట్లు కొన్ని వార్తలు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చిన విషయం మనకు తెలిసింది.

కానీ ఆ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించబోయే ముద్దుగుమ్మను రేపు ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ లో బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ల లిస్ట్ లో రెండు ... మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎవరో ఒక హీరోయిన్ ను రేపు ఈ చిత్ర బృందం ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: