మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఎప్పటినుండో తమ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే చిరంజీవి మరియు బాలకృష్ణ మంచి స్నేహితులు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ రాజమౌళి మరియు ప్రశాంత్ ఇలాంటి టాప్ దర్శకుల కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు తలుచుకుంటే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం

 అంత పెద్ద పని ఏమీ కాదు. ఇటీవల సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణ నటించిన సినిమాలో ఓకే థియేటర్లలో విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి సినిమాలు ఒక సినిమాకి మించి మరొక సినిమా విజయాన్ని అందుకున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక వేళా చిరంజీవి మరియు బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఆ సినిమాలో ఒక ఒకరి పాత్ర ఎక్కువ మరొకరి పాత్ర తక్కువైతే వారి అభిమానులు ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ కారణంగానే ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా వచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది.

ఇక ఆ కారణం గా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి దర్శకులు సైతం ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే వీళ్లిద్దరి ఫ్యాన్స్ మధ్య దూరం కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈసారి జరిగినట్టుగానే రాబోయే ఈ రెండు సినిమాలు కూడా ఒకే సమయంలో వస్తాయేమో అని భావిస్తున్నారు. అంతేకాదు దసరా పండుగ కానుకగా వీరిద్దరి సినిమాలు మళ్లీ ఒకేసారి పోటీ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: