
తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకొని ఎందరినో అభిమానులుగా మార్చకుంది కాజల్. నటన పరంగా కూడా మంచి మార్కులు సొంతం చేసుకుంది.మొదటి నుండి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా మంచి విజయాలు అందుకుంది కాజల్ అగర్వాల్. అలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇప్పటివరకు కాజల్ ఎలాంటి చెడ్డ పేరు ను తెచ్చుకోలేదు.
కాజల్ తన జీవితంలో కేవలం సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా హుందాగా నడుచుకుంది.కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే తన స్నేహితుడియిన గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికీ ఒక బాబు కూడా పుట్టాడు.కాజల్ నిరంతరం తన కొడుకు బాధ్యతను చూసుకుంటూ తన జ్ఞాపకాలని సోషల్ మీడియా వేదికగా తెలియ జేస్తుంది.
పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్ట్ తో పలు సినిమాలల్లో కూడా చేసింది. అలా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా మంచి భార్యగా అలాగే మంచి తల్లిగా కూడా బాధ్యతలు చేపడుతుంది.
ప్రతిరోజు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో హ్యాపీగా కనిపిస్తుంది కాజల్. తన భర్తతో దిగిన ఫోటోలను, తన బాబుతో దిగిన ఫోటోలను పంచుకుంటూ అందరి దృష్టిలో కూడా పడుతుంది. తన కొడుకు ఎదగటంతో ఆడుకునే వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది. ఆ వీడియోలను చూస్తూ తెగ మురిసిపోతూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కొడుకు సంబంధించిన ఒక వీడియో ను షేర్ చేసుకుంది. అందులో తన కొడుకు వర్కౌట్ మాదిరిగా ఒక స్టిల్ ఇవ్వటంతో అది చూసి వెంటనే ఆ వీడియోని షేర్ చేసుకుందటా కాజల్. తన కొడుకు చేసింది చూసి వండర్ అంటూ ఆమె మురిసిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ వీడియో చూసిన కాజల్ అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కాజల్ మాదిరిగా కొడుకు కూడా తయారవుతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారటా.09:22 PM