టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తన మాజీ భార్య రమ్య పై సంచలన ఆరోపణలు చేశాడు. తన మాజీ భార్య రమ్య, రోహిత్ శెట్టి వల్ల తనకు ప్రాణహాని ఉందని తాజాగా కోర్టును ఆశ్రయించాడు ఈ సీనియర్ నటుడు. తన మాజీ భార్య రమ్య ఆస్తికోసం తనను చంపేందుకు ప్రయత్నాలు చేస్తోందని, అందుకోసం ఓ సుపారి గ్యాంగ్ మాట్లాడుకొని మరి తనను చంపాలనుకుందని నరేష్ తెలియజేశాడు. రమ్య వల్ల తాను రోజు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొంటూ ఈ ఘటనపై తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నరేష్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ..' పెళ్లయిన కొన్ని నెలలకే తనను వేధింపులకు గురి చేసిందని, తన తల్లితో పాటు బెంగళూరులోనే ఉండాలని కండిషన్ పెట్టిందని చెప్పుకొచ్చాడు.

తనకు రమ్యకి 2012లో రణ్వీర్ పుట్టాడని, అప్పటినుంచి కూడా తనలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పాడు నరేష్. తనకు ఏమాత్రం తెలియకుండా కొన్ని బ్యాంకుల వద్ద, వ్యక్తుల దగ్గర తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందని.. ఇక ఆ అప్పులు తీర్చేందుకు స్వయంగా తాను పది లక్షలు చెల్లించాలని, అలాగే తన కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షల కూడా తన భార్య రమ్య తీసుకుందని తెలిపాడు. ఈ క్రమంలోనే తన ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి రమ్య ప్రయత్నిస్తోందని, ఇక అప్పు ఇచ్చిన వాళ్లంతా ఇంటికి వచ్చిన వేధించేవారని అన్నారు.అంతటితో ఆగకుండా కాంగ్రెస్ లీడర్ రఘువీరా రెడ్డి చేత ఫోన్ చేపించి మరీ బెదిరించిందని.. తనను చంపేస్తారనే భయంతో తాను ఒంటరిగా ఎక్కడికి వెళ్లడం లేదని నరేష్ తెలియజేశాడు.

అంతేకాదు రమ్య తనకు తెలిసిన ఓ పోలీస్ ఆఫీసర్ ద్వారా తన ఫోన్ హ్యాక్ చేసి మెసేజ్లు సైతం చూసేదని తెలిపాడు. ఇక 2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు తన ఇంట్లో చొరబడ్డారని 24 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి వచ్చామని మాయమాటలు చెప్పారని పేర్కొన్నాడు. ఇక ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు కూడా చేశానని తెలియజేశాడు నరేష్. ఈ నేపథ్యంలోనే తన మాజీ భార్య రమ్య వేధింపులు అసలు భరించలేకపోతున్నారని కోర్టు ద్వారా తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. ఇక తన భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని నటుడు నరేష్ తాజాగా కోర్టును ఆశ్రయించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: