యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాలు శివ దర్శకత్వంలో చేయనున్నాడు. అనంతరం తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం ఎన్టీఆర్డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్న ప్రశ్న  అందరిలో నెలకొంది. అయితే ఇప్పటికే బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న ఈయన తర్వాత కూడా ఒక సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా ప్రకటించినప్పటికీ ఆ సినిమా ఆగిపోయింది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారక్ మరియు త్రివిక్రమ్ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయని ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మరో ప్రాజెక్టు కూడా ఉంది అని సమాచారం.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 32 జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు అట్లీ కాంబినేషన్ గురించి కూడా ప్రస్తుతం వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే తారక్ కి అట్లీ కథ కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సంజయ్ లీల బీంసాలి డైరెక్షన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ జనరేషన్ డైరెక్టర్లు సైతం జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు రిషబ్ శెట్టి కాంబినేషన్లో కూడా ఒక సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఈ కాంబినేషన్ కి తారక్ ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: