ఒక సినిమాను నమ్ముకుని ఒక దర్శకుడు మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకోవడం అత్యంత దురదృష్టకర విషయం. ఇప్పుడు దర్శకుడు క్రిష్ విషయంలో అదే జరుగుతోంది అని అనిపిస్తోంది. క్రిష్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ప్రారంభంమైన ‘హరిహర వీరమల్లు’ మూడు సంవత్సరాలు కాలం గడిచిపోయినా ఇంకా ఆమూవీ పూర్తికాలేదు. క్షణం తీరికలేని రాజకీయ వ్యవహారాలలో సతమతమైపోతున్న పవన్ తన రెండు పడవల ప్రయాణం వల్ల ఈమూవీని రకరకాల కారణాలతో ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయాడు.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకు 60శాతం పూర్తి అయినప్పటికీ మిగిలిన 40శాతం షూటింగ్ పవన్ మరో రెండు మూడు నెలలలో పూర్తి చేస్తాను అని చెపుతున్నప్పటికీ అన్నమాట ప్రకారం పవన్ ఈమూవీ షూట్ ను పూర్తి చేసే అవకాశాలు లేవు అన్నఅంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈమూవీ నిర్మాత రత్నం ఈమూవీ పై భారీగా పెట్టుబడి పెట్టడంతో వడ్డీలకు ఈమూవీ నిర్మాత పై బాగాభారం పడుతోంది అన్న గుసగుసలు కూడ వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సంబంధించి ఒక గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీ షూటింగ్ పార్ట్ 60శాతం మాత్రమే పూర్తి అయినప్పటికీ ఈమూవీ ఔట్ పుట్ చాలఎక్కువగా రావడంతో దానిని ఎడిట్ చేసి ఈమూవీకి సంబంధించి పార్ట్ వన్ గా విడుదలచేయాలి అన్నఆలోచనలు క్రిష్ కు రావడంతో ఈవిషయమై క్రిష్ పవన్ తోను అదేవిధంగా ఈమూవీ బయ్యర్లతోను చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా క్రిష్ ఆలోచించడానికి మరొకకారణం ఉంది అన్నప్రచారం కూడ జరుగుతోంది.


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలచేసిన టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఈమూవీ విడుదల రకరకాల కారణాలతో వాయిదా పడుతూ ఉండటంతో ఈమూవీ పై ఏర్పడ్డ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఒక సినిమాను మొదలుపెట్టి రెండు భాగాలుగా తీయడం ఒక ట్రెండ్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ తో పాటు ప్రభాస్ ‘సలార్’ సినిమాను కూడ రెండు భాగాలుగా తీస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి ‘హరిహర వీరమల్లు’ కూడ చేరిపోయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: