ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా జైత్రయాత్ర జపాన్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఆర్ఆర్ఆర్ సినిమాకు జపాన్‌లో ప్రేక్షకుల ఆధరణ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా నెల రోజులు ఆడిందంటేనే అది చాలా గొప్ప విషయం. అలాంటిది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఏకంగా వంద రోజులను దాటేసింది. అది కూడా మూడు వేల ఏడు వందల మైల్స్‌ దూరంలో ఉన్న జపాన్‌ దేశంలో ఈ రికార్డు క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. మన సినిమా పొరుగు దేశంలో వంద రోజులు పైగా ఆడిందంటే అది మామూలు విషయం కాదు. గత సంవత్సరం అక్టోబర్‌ 21న భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ ని రాబట్టింది. తొలివారంలోనే జపాన్లో ఏకంగా రూ.4 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి.. ఫస్ట్‌ వీక్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.


ఇంకా అంతే కాకుండా 24ఏళ్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ ముత్తు(24.14 కోట్లు) పేరిట ఉన్న రికార్డును కేవలం నాలుగు వారాల్లోనే బ్రేక్‌ చేసి rrr సంచలనం సృష్టించింది. ఇక ఈమధ్య ఏకంగా 114 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డును క్రియేట్‌ చేసింది. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మరో రేర్‌ ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్‌లను పోల్చితే 105వ రోజు ఎక్కువ కలెక్షన్‌లు రాబట్టినట్లు ఈ మూవీ మేకర్స్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటి దాకా జపాన్‌లో ఈ సినిమాను మొత్తం 5,13,787 మంది వీక్షించినట్లు తెలిపారు. ఆస్కార్‌ బరిలో చోటు దక్కించుకున్నాక ఈ సినిమాపై క్రేజ్‌ ఇంకా ఎక్కువ పెరిగింది. బిగ్‌ స్క్రీన్‌లో ఈ సినిమాని చూడడానికి జపాన్‌ ప్రేక్షకులు థియేటర్‌లకు ఎగపడుతున్నారు. ఈమధ్యనే జపాన్‌లో డాల్బీ విజన్‌ స్పెషల్‌ ప్రింట్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: