మంచి కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు తీస్తూ జనాలను అలరిస్తూ వుండే అతి కొద్ది మంది డైరెక్టర్ లలో తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్ కూడా ఒకరు. తమిళ స్టార్ హీరోయిన్ నయనతారతో చాలా కాలం డేటింగ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇతని డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి పెద్ద పెద్ద హీరోలు కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే తాజాగా ఈయన చేసిన ఓ పనితో తమిళ ఫిల్మ్ అభిమానులు కంగుతిన్నారు. గత సంవత్సరం తన వైఫ్ నయన్, త్రిష, విజయ్ సేతుపతి కాంబోలో 'కాతువాకుల రెండు కాదల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విఘ్నేశ్.ఈ సినిమా మరీ అంత పెద్ద హిట్ కాకపోయినా ఓ మోస్తారుగా ఆడింది. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతను తమిళ టాప్ హీరో అజిత్‌తో చేయబోతున్నట్లు తెలిపి.. ఆ సినిమా పై హైప్ మరింత పెంచేశారు. అజిత్ 62వ సినిమాగా వస్తున్న ఈ మూవీ లైక్ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాబోతున్నట్లు గతంలో అధికారికంగా అనౌన్సిమెంట్ కూడా వచ్చింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు స్టార్టవుతుందా అని అజిత్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


ఈమధ్య విఘ్నేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అజిత్ ఈసారి స్ట్రాంగ్ హిట్ కోసం విగ్నేష్ ని పక్కన పెట్టి వేరే డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. జరిగిన అవమానం తట్టుకోలేక అందుకు తగ్గట్లుగానే విఘ్నశ్ కూడా తన ట్విట్టర్ బయో నుంచి AK 62 అనే పేరును రిమూవ్ చేయడం జరిగింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.ఈ మూవీ గురించి వచ్చిన వార్తలు నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో ఇప్పట్లో ఉండదని ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ టెంపరరీగానే క్లోజ్ అయ్యిందా… లేదా పర్మనెంట్‌గా ఆగిపోయిందా అనే విషయంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: