ప్రస్తుతం ఉన్న సినీ సెలబ్రిటీలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై కూడా ఎప్పటికప్పుడు ఎన్నో ఊహాగానాలు వ్యక్తమౌతూ ఉంటాయి. ముఖ్యంగా ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయం నుంచి కృతిసనన్ ప్రభాస్ పైన ఎన్నో రూమర్స్ రావడం మొదలుపెట్టాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభాస్ మరియు కృతి అత్యంత సన్నిహితంగా ఉన్నట్లుగా వీరి రిలేషన్ పై క్యాప్షన్లు కూడా చేయడం మొదలుపెట్టారు.

బాలయ్య షోలో కూడా కృతి సనన్, అనుష్క ఫోటోలు చూపించి వీరిలో ఎవరు ఇష్టం అని కూడా బాలయ్య అడిగారు. కానీ ప్రభాస్ ఈ విషయాన్ని దాటవేశారు. కానీ తాజాగా ఇప్పుడు ప్రముఖ సెన్సార్ బోర్డ్ మెంబర్గా విమర్శకుడిగా చెప్పుకుంటున్న ఉమైర్ సందు చేసిన ఒక ట్వీట్ చాలా వైరల్ గా మారుతుంది.. బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ , కృతి సనన్ ల నిశ్చితార్థం మాల్దీవులలో జరగబోతోంది. పెళ్లి కోసం అందరూ ఎదురుచూడండి అంటూ ట్వీట్ చేయడంతో ఆయన ట్వీట్ చేసిన క్షణాల్లో ఈ ట్వీట్ కాస్త చాలా వైరల్ గా మారుతుంది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. కృతిసనన్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాతోపాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నాడు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టుకే చిత్రం పైన తెలుగు వారికి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతీతో కూడా రాజా డీలక్స్ సినిమా ఇప్పుడు వర్కింగ్ టైటిల్ తో హర్రర్ కామెడీ మూవీ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇన్ని ప్రాజెక్టుల మధ్య ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మరొకవైపు వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.  మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ప్రభాస్ లేదా కృతి సనం ఎవరో ఒకరు స్పందిస్తే ఇలాంటి వార్తలకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: