నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో హనీ రోజ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన మూవీ కావడం ... క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డ కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 74 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇలా 74 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా  79.82 కోట్ల షేర్ ... 134.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.82 కోట్ల లాభాలు దక్కాయి. ఇలా బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" మూవీ తో అద్భుతమైన లాభాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: