‘రానా నాయుడు’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన కొన్ని గంటలకే ఆ వెబ్ సిరీస్ లోని బూతు సీన్స్ బూతు డైలాగ్ లు తట్టుకోలేక వెంకటేష్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాల వెబ్ సిరీస్ లో అశ్లీల సంభాషణలు అశ్లీల సీన్స్ ఉండటం సాధారణమైన విషయంగా మారిపోయింది.


ఇలాంటి సీన్స్ తో కూడిన వెబ్ సిరీస్ ను చూడటం ఎప్పటి నుండో అలవాటు చేసుకున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను చూసి వెంకటేష్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది చాలామందికి అర్థంకాని విషయంగా మారింది. ఏకంగా వెంకటేష్ రామానాయుడు పేరును చెడగోడుతున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అసలు వెంకీ పై ఎందుకు ఈనెగిటివ్ ప్రచారం జరుగుతోంది అన్నది ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.


ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ గురించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మూడు సీజన్స్ గా తీయాలని ముందుగానే వెంకటేష్ రానా తో ఎగ్రిమెంట్ చేసుకున్నారట. దీనితో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరొక రెండు సీజన్స్ లో వెంకటేష్ తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకున్న ఎగ్రిమెంట్ రీత్యా మరొక రెండు సీజన్స్ లో నటించాలి.


అయితే ఈ వెబ్ సిరీస్ కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ రీత్యా వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరొక రెండు సీజన్స్ లో తాను నటించను అని చెపితే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యానికి పెనాల్టీ కట్టుకోవలసి వస్తుంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి మొదట్లో వెంకటేష్ అయిష్టత వ్యక్త పరిచినప్పుడు రానా బలవంతంతో ఈ వెబ్ సిరీస్ నటించాడు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. వాస్తవాలు ఏమిటి అన్నది వెంకటేష్ కు తెలియాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: