పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో వినోదయ సీతం అనే తమిళ మూవీ కి అధికారి రీమేక్ గా రూపొందబోతున్న మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో యంగ్ హీరో సాయి దరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సాయి తేజ్ సరసన శ్రీ లీల కానీ కేతిక శర్మ కానీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

రీమేక్ మూవీ కి సముద్ర కని దర్శకత్వం వహించబోతున్నాడు. సముద్ర ఖనిమూవీ ఒరిజినల్ కు కూడా దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ కథలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఒరిజినల్ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవు కానీ తెలుగు లో మాత్రం రెండు పాటలను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ విడుదల చేయడానికి ఫిక్స్ అయినట్లు ... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో మొదటి సారి పవన్ ... సాయి తేజ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: