టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఇమే ఎక్కువగా లేడి చిత్రాలలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది సమంత. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు కూడా ఈ సినిమా వాయిదా పడుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి వార్తలు పైన చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది వాటి గురించి తెలుసుకుందాం.


సినిమా శకుంతల,దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కించిన చిత్రం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది .ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్లే గత నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాకు మంచి హైప్  ని తీసుకువచ్చాయి. గడచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఈ సినిమా కూడా వాయిదా పడుతోంది అంటూ వార్తలు వినిపించాయి.కానీ ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నామంటూ చిత్రబృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పు లేదంటూ కూడా తెలియజేసింది.

రీసెంట్ గా సమంత కూడా ఈ సినిమాను చూసినట్లు తెలియజేయడం జరిగింది. ఈ సినిమా తన జీవితంలో మర్చిపోలేనిది అంటూ తన ట్విట్టర్ నుంచి ఆసక్తికరమైన పోస్టును కూడా షేర్ చేసింది సమంత నాకు చిన్న వయసు నుంచి డిస్నీ మూవీస్ అంటే చాలా ఇష్టం అలాంటి సినిమాలలో నటించాలని కలవుండేది తాజాగా శాకుంతలం సినిమాతో ఆ కల నెరవేరిందని తెలియజేయడం జరిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: