అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎన్నో భారీ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. కాజల్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించింది.

అలాగే కొన్ని రోజుల క్రితమే కాజల్ ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా కాజల్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా కాజల్ తాజాగా ఘోష్టి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీnని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదలకు దగ్గరపడిన ఈ మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి జీ 5 "ఓ టి టి" సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను జీ 5 డిజిటల్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజల్ ... లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: