
తన అద్భుతమైన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం కూడా కాలు కదిపింది. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో ప్రేమ్ రక్షిత్ మాట్లాడారటా.తన తర్వాత ప్రాజెక్ట్‌ల గురించి అలాగే ఆస్కార్ అనుభవం గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
''ప్రస్తుతం నా సంతోషాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలవు. ఈ విజయంతో నేనే కాదు నా కుటుంబం అంతా కూడా చాలా సంతోషం గా ఉంది. ఆస్కార్ ఈవెంట్ కోసం మేము అమెరికా వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్ చేశాం. వేదికపై 'నాటు నాటు' పాటకు విదేశీయులు డ్యాన్స్ చేస్తుంటే ఎంతో ఆనందం వేసింది. తాజాగా ప్రభుదేవా ఈ పాటకు తన బృందంతో కలిసి సెప్ట్స్ కూడా వేశారు. ఆ వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రభుదేవాని 'గాడ్ ఆఫ్ డ్యాన్స్' అంటారు. అలాంటి వ్యక్తి నన్ను మొచ్చుకొని నా పాటకు డ్యాన్స్ వెయ్యడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు దక్కిన గొప్ప గౌరవంగా అయితే భావిస్తా'' అని అన్నారు.
తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడిన ప్రేమ్ రక్షిత్ 'నాటు నాటు' తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమాకు పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.. '' ఎన్టీఆర్ 30వ సినిమాకు నేను కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.త్వరలోనే రాజమౌళి తో కలిసి ఓ సినిమా లో చెయ్యనున్నా. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఆయన్ని నేను కలవాలి'' అని చెప్పారు. ఇక ఈ సంగతి తెలిసిన నెటిజన్లు మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతున్నందుకు తెగ ఖుషి అవుతున్నారు. రాజమౌళి విజన్‌కు ప్రేమ్‌రక్షిత్ టాలెంట్ కలిస్తే పెద్ద సెన్సేషన్ అవుతుంది.