స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలు షూటింగ్ చేస్తున్న సమయం కావడం చేత అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ ఏడవ తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప -2 సినిమా నుంచి ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతొంది..


అయితే డైరెక్టర్ సుకుమార్ ఆలోచన మాత్రం వేరే లాగా ఉందని అల్లు అర్జున్ బర్తడే సర్ప్రైజ్ విషయంలో ఇంకా ప్రత్యేకంగా ఉండాలని ఇప్పటివరకు రానటువంటి విధంగా ఈ సినిమా నుంచి ఒక కొత్త రీతిలో ప్రోమో కట్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే ప్రోమో కట్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం ఆయన మీద ఎలివేషన్స్ షాట్స్ ఏవైనా తీశారో వాటితో ఈ ప్రోమో కట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాపై బన్నీ ఆర్మీతో పాటు అల్లు అర్జున్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఏకంగా ఈ సినిమాని కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక కలెక్షన్ల పరంగా ఈసారి కచ్చితంగా రూ.1000 కోట్ల మార్కులు దాటాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.అందుకు తగ్గట్టుగానే హై వోల్టేజ్ ఎలిమెంట్స్ తో పాటు పవర్ఫుల్ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ కలర్ తో ఈ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేయాలని చూస్తోంది చిత్ర బృందం. మొదటి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టు కావడంతో కచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ పైన కూడా మంచి బస్ ఏర్పడింది మరి ఏ విధంగా ఈ సినిమా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: