దసరా సినిమా నిన్నటి రోజున విడుదలై తెగ సందడి చేస్తోంది.ఈ సినిమా బాగానే ఉంది అంటూ టాక్ అయితే వినిపిస్తున్నది.. కొంతమంది ప్రేక్షకులు మాత్రం మిక్స్డ్ టాక్ ను తెలియజేస్తున్నారు.. చాలామంది మాత్రం జస్ట్ ఓకే అని తెలియజేస్తున్నారు. ఫైనల్గా ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది అలా ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో అంతా బాగానే నడిచిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సెకండాఫ్ వచ్చేసరికి ట్రాక్ తప్పడనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం అంతా సెట్ అయిందని టాక్ బయట వినిపిస్తోంది.. అంతేకాకుండా సినిమాలలో సముద్రఖని పాత్రకి కేవలం రెండు డైలాగులు మాత్రమే ఇవ్వడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ట్రెండ్లీగా ఉన్న నటుడు ఈమధ్య పవన్ కళ్యాణ్ తో కూడా సినిమాని చేయడానికి దర్శకత్వం ఒప్పుకున్నారు.. అలాగే పలు చిత్రాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే సందడి చేశారు సముద్రఖని.. తన పాత్రకు తక్కువగా మాట్లాడడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.

నాని ఫ్యాన్స్ కి మాత్రం ఈ చిత్రం వావ్ అనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది . జనరల్ ఆడియన్స్ మాత్రం సినిమా కోసం సినిమాలన్నీ కలిపి కొట్టినట్టుగా కథ ఉందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మేకింగ్ పరంగా దర్శకుడు కి మార్కులు పడుతున్న సినిమా విషయంలో చాలా మిస్టేక్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమాలో నాని ఒక్కడు డిఫరెంట్ గా కనిపించారు తప్ప మిగతాదేమి అద్భుతమైన కధేమి కాదంటూ తెలుపుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది దసరా సినిమా కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని రేంజ్కి ఈ సినిమా చాలా ఎక్కువే అని కామెంట్లు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: