సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనుండగా ... జయరామ్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దీనితో ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ బృందం ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ జోష్ లో పూర్తి చేస్తూ వస్తుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటికే ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల నుండి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది . ఈ షెడ్యూల్ లో ఈ సినిమా బృందం చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు . ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ మూవీ పై ఇంటర్నేషనల్ గా క్రేజ్ ఏర్పడింది. మహేష్ ... రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: