పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొంది అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ... వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న తదుపరి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలాగే ఇది వరకు పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ కి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి కూడా సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే సాలిడ్ అప్డేట్ ను ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోను మే 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ గ్లిమ్స్ వీడియో పై పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: