ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఎక్కువగా మగపిల్లలే కావాలని కోరుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆడపిల్లలు కలగాలని కోరుకుంటు ఉంటారు.

ఇక మొదటగా ఆడపిల్ల పుడితే అదేదో పాపం జరిగినట్టు పోయిండుగా చాలా ఫీల్ అవ్వడం, అలా పుట్టిన పిల్లలను చంపేయడం లేదంటే పారేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అనుభవమే ఒక హీరోయిన్ కు ఎదురయ్యింది. ఆ హీరోయిన్ ఎవరు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరోయిన్ మరెవరో కాదు కరిష్మా తన్నా. ఆమె పుట్టినప్పుడే తన తండ్రి ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. మాది గుజరాతి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. మా పెద్దనాన్న వాళ్లు తాతయ్య బిజినెస్ లో బాగానే సంపాదించారు. కానీ మా నాన్న మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. నేను మూడవ తరగతి చదివే వరకు ఆ కష్టాలు వెంటాడాయి. నేను పుట్టినప్పుడు మా నాన్న అసలు సంతోషంగా లేడని నేను పెద్దయిన తర్వాత మా అమ్మ నాకు చెప్పింది. నాన్న కొడుకు కావాలని ఎదురు చూశాడట కానీ నేను పుట్టడంతో నిరాశ చెందాడట. అన్ని గుజరాతి కుటుంబాల లాగే మా ఇంటి వాళ్ళు కూడా మగపిల్లాడే కావాలని ఒత్తిడి చేశారు.

అబ్బాయి అయితేనే ఇంటిని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలడని, డబ్బు బాగా సంపాదించగలరని భావించారు. అమ్మమ్మ తాతయ్య నన్ను పవర్ ఫుల్ గర్ల్ గా పెంచారు. ఒక అబ్బాయి ఎలా అయితే ఏదైనా సాధించగలను అమ్మాయి కూడా అలాగే చేయగలదు అని నిరూపించాలని అనుకున్నాను. కానీ ఇప్పటికి నన్ను బాధించే విషయం నేను పుట్టగానే అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు. పుట్టిన తర్వాత అమ్మ ఒక వారం రోజులు పాటు నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మా నాన్న అయితే నెల రోజులపాటు నేనెవరో కూడా తెలియదు అన్నట్లుగా ఉండిపోయాడు. నేను ఎలా ఉన్నానో కూడా పట్టించుకోలేదు అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా. ఈ విషయాలన్నీ నాకు మా అమ్మ చెప్పినప్పుడు నా గుండె పగిలిపోయింది. నేను పెద్దయిన తర్వాత మా నాన్నకు మాట ఇచ్చాను. కొడుకు దగ్గర నుంచి ఏవైతే ఆసిస్తావో అవన్నీ మీకు నేను అందిస్తాను ఇకమీదట నేను నీ కొడుకుని అని చెప్పాను అని కరిష్మా చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగానే ఆయనకి ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకున్నాను అని తెలిపింది కరిష్మా.

మరింత సమాచారం తెలుసుకోండి: