సినీ ఇండస్ట్రీలో సాధారణంగా చాలామంది హీరో హీరోయిన్లు మోసపోతూ ఉంటారు. కానీ చాలామంది వాటన్నిటిని కెరియర్ కోసం లైట్ తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రేమలో పడి ఆ విషయాన్ని సీరియస్ తీసుకుని ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అయితే సరిగ్గా ఇదే తరహాలో సదా విషయంలో కూడా జరిగిందన్న ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జయం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తన అందంతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది ఈమె.కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అలాంటి ఫామ్ సెట్ చేయలేకపోతోంది సదా.

 ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించే ఈ అందాల భామ ఇప్పుడు వయసు మీద పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కానీ అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ను కొనసాగిస్తుంది .అయితే తాజాగా ఇప్పుడు సదా కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సదా మొదటి సినిమా జయం నితిన్ తో నటించిన సినిమా.అనంతరం దర్శకుడు తేజ జయం రెండవ భాగం తీయాలని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ఇటీవల నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో సదాతో ఒక ఐటమ్ సాంగ్ చేయించాలని ఆమెని అడగగా

 మొదట పాజిటివ్ గానే స్పందించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు వస్తూ ఉండడంతో ఐటమ్ సాంగ్ చేయడం కష్టమని చెప్పేసిందట. ఈ రకంగా సదా స్టార్ హీరో నితిన్ ని మోసం చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఒకప్పుడు నీ పక్కన హీరోయిన్గా చేసిన నేను ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఉద్దేశంతో సదా దీనికి అంగీకరించలేదు అని తెలుస్తోంది. అంతేకాదు ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే దానికి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. ప్రస్తుతం నాకు హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. దానికి రెమ్యూనరేషన్ ఎక్కువ... ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకొ అంటూ నితిన్ రిక్వెస్ట్ చేసిందట సదా. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: