ప్రతి వ్యక్తిలోనూ ఎదో ఒక శక్తి నిద్రాణంగా ఉంటుంది. ఆ శక్తిని నిద్రలేపి కార్యాచరణకు పూనుకున్నప్పుడు మాత్రమే మనకు విజయం కలుగుతుంది. 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అబ్రహం లింకన్ ఆయన జీవితంలో ప్రతి విషయంలోనూ విఫలం అయ్యాడు. అయితే ఆ మహనీయుడి జీవితంలో అనూహ్యమైన మలుపు ఆయన 40వ సంవత్సరంలో రావడంతో ఆతరువాత ఏకంగా ఆయన అమెరికా అధ్యక్షుడి స్థాయికి ఎదిగిపోయారు.


అదేవిధంగా భారత జాతి చరిత్రను ఒక మలుపు తిప్పి భారత జాతికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మాగాంధీని అప్పట్లో చూసినవారు కేవలం ఒక సామాన్యుడుగానే భావించేవారు. అయితే తాను నమ్మిన సిద్దాంతం కోసం దక్షిణ ఆఫ్రికాలో ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టి ఏకంగా ఆదేశ నాయకులకే తన పట్టుదలతో గాంధీ తన అహింసా సూత్రంతో అక్కడ విజయం సాధించి అదే సూత్రాన్ని మన ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటీష్ వారి పై ప్రయోగించి దేశాన్ని గాంధీ స్వాతంత్ర్యం వైపు నడిపించాడు.


అమెరికాలో ప్రసిద్ధమైన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పోరేషన్ ను స్థాపించి అమెరికాలోని ధనవంతులలో ఒకడుగా మారిన జాన్ లోవెల్ పుట్టుకతో ఒక సామాన్యుడు అన్న విషయం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఒక పుట్టినరోజు వేడుకలకు సంబంధించి జరిగిన విందులో జాన్ లోవెల్ కు వచ్చిన ఒక చిన్నపాటి ఆలోచన ఆ తరువాత అతడిని యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పోరేషన్ అధినేతగా మార్చివేసింది. 


అమెరికాలో ఉక్కుమనిషిగా పేరుగాంచిన ఈయన తనకు 88 సంవత్సరాలు వచ్చే వరకు ప్రపంచ సంపన్నుల జాబితాలో కొనసాగుతూ ఆయన మరణించే వరకు అలుపు ఎరగని వ్యాపారం చేసి రాణించారు అంటే ఆయన తనలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలను మేల్కొనపడం వలెనే జరిగింది. చారిత్రిక దృష్టితో చూస్తే ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలుగా కనిపిస్తాయి. అయితే ఇలా పైన పేర్కొన్న వీరంతా ప్రపంచ ప్రముఖులుగా రాణించడానికి వారిలో నిద్రాణంగా ఉన్న మేధావిని మేల్కొలిపి ప్రపంచ స్థాయిలో కీర్తిని పొందారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: