ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేస్తున్న ఎంతోమంది జీతభత్యాలు సరిపోవడం లేదని ధర్నాలు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న జీతభత్యాలు సరిపోవడం లేదని, ఇల్లు నడవడం కూడా కష్టంగా ఉందని, మరి కొంత మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. అదేమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఏడవ జీతభత్యాల సంఘం ఆదేశాల మేరకు జులై 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతం కూడా పెరగనుంది. అంతేకాదు జులై 1వ తేదీ నుంచి జీతభత్యాలను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సంస్థలు చెబుతున్నాయి.. అయితే ఇటీవల పెరగనున్న డీ ఏ , డీ ఆర్ అలవెన్స్ లను గతంలో ఇవ్వకుండా, పెండింగ్లో పెట్టిన వీటన్నింటిని ఇస్తామని కేంద్ర ప్రభుత్వాలు సూచించినప్పటికీ కొన్ని కారణాల వల్ల కేవలం జులై 1వ తేదీ నుంచి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఇక గతంతో పోల్చుకుంటే, ఇప్పుడు కొత్తగా పెరిగిన డీ ఏ, డీఆర్ లు తాజా నిర్ణయం తర్వాత 26 శాతం వరకు పెరగనున్నాయి. ఇక దీనికి సంబంధించిన వివరాలను కాస్ట్ ఇండెక్షేషన్ ను జూన్ 30వ తేదీన వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక దీని తర్వాతనే డీఏ ని, పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ కింద 17 శాతం లభిస్తుండగా, ఇప్పుడు జులై 1వ తేదీ నుంచి అది 28 శాతానికి పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి