సహజంగా ప్రతి ఒక్కరికి ఎన్నో కళలు ఉంటాయి అవి నెరవేర్చుకోవడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి..? ముఖ్యంగా పండుగలు వస్తే ఏవైనా కొత్త బట్టలు కొనుగోలు చేయాలి అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇదే సమయంలో వస్తు శాఖల పన్నును 5% నుండి 12% వరకూ పెంచుతూ సామాన్య ప్రజలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన కేంద్రం. ఈ కొత్తగా అమలు చేసిన జీఎస్టీ ని 2022 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి అని ప్రకటించి.. అందరినీ నిరాశకు గురి చేసింది..కానీ ఇప్పుడు అలాంటి వారందరికీ ఒక శుభవార్త తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.


ఇకపోతే జిఎస్టి మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం 46 వ సమావేశం ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ప్రారంభమయ్యింది. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణ ప్రధాన కారణం అని సమాచారం. వస్త్రాలపై 12% జీఎస్టీ పెంపు విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్దఎత్తున డిసెంబర్ 30వ తేదీన ఆందోళన చేపట్టారు.

ఇక మరోవైపు సీతారామన్ ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన బడ్జెట్ లో ముందస్తు సమావేశాల్లో ప్రస్తుతం ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. కానీ ఈ నిర్ణయాన్ని మెజారిటీ రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. మొట్టమొదటిసారి వస్త్రాలపై 5% జిఎస్టి పెంచి అందరికీ నష్టాలను కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. మరోసారి ఇంకో 7 శాతం జీఎస్టీ పెంచుతూ నేతన్నల కడుపు కొడుతోంది అంటూ పలువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పెంచడం వల్ల నేతన్నలు పూర్తిస్థాయిలో నష్ట పోతారు అని.. బట్టలు కొనడానికి ఎవరూ ముందుకు రారని.. అప్పుడు మాత్రమే కాదు వస్త్ర వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు.. నష్టాలను చూడక తప్పదు అంటూ వారు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: