ఎవరైనా తమ భవిష్యత్తు కోసం.. తమ పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకోసం తామ సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పలుచోట్ల పథకాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ తరంలో కొందరికి ఎలాంటి పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది అనే విషయం పై పెద్దగా అవగాహన ఉండదు. అందుచేతన ఎక్కువగా రిస్క్ చేస్తూ ఉండరు కొంతమంది. దేశంలో అతి పెద్ద బీమా సంస్థ lic సామాన్యుల కోసం వివిధ రకాలుగా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాంటి వాటిలో కొన్ని పెట్టుబడులతో అధిక రాబడులు వచ్చే పాలసీలు ఉంటాయి. అందులో ఒకటి lic చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్. ఈ పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


ఎల్ఐసి చిల్ద్రెన్ మనీ ప్లాన్.. ఏమిటంటే పిల్లల భవిష్యత్తు పెళ్లి వంటి అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా.. ఈ పాలసీ టర్మ్ లో పిల్లలకు ఎలాంటి రిస్కు సమస్యలు వచ్చిన ఆ డబ్బును అందిస్తుంది. ఈ పాలసీని పిల్లల పేరు మీద మాత్రమే తీసుకోవాలి. వారి వయసు 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ పిల్లలు 18, 20, 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి  మొత్తంలో 20% పొందుతారు. ఒకవేళ పాలసీదారుడు మధ్య లోనే మరణించినట్లయితే నామినీకి పెట్టుబడిగా పెట్టిన డబ్బులు 105 % రిటర్న్ వస్తుంది.


ఈ పాలసీ ప్లాన్ కింద మనం ప్రతి నెల రూ.4500 డిపాజిట్ చేస్తే చాలు పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు అయిపోతే సంవత్సరానికి రూ.54 వేల రూపాయలు డిపాజిట్లు చేసినట్లే.. అలాగే మొత్తం కాల వ్యవధి చూసుకుంటే ఈ డబ్బు సుమారుగా రూ.6 లక్షల 48 వేలకు చేరుతుంది. ఈ పాలసీని మరో ఎనిమిదేళ్లపాటు పొడిగించుకుంటే మొత్తం మీద రూ.20 లక్షల వరకు పొంద వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: