
అందుకే భోజనానికి బదులుగా చపాతి, పుల్కా వంటి లైట్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదట.. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా డాక్టర్ల సలహా మేరకు ఇలాంటివే తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దీనినే మీరు వ్యాపారంగా మార్చుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది. మీరు ప్రతి రోజు సాయంత్రం పుల్కా లేదా చపాతి చేసే బిజినెస్ చేయడం వల్ల సాయంత్రం పూట రెండు గంటలు కష్టపడితే చాలు కనీసం రోజుకు 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు హ్యాండ్ మేడ్ కాకుండా మెషిన్ సహాయంతో వీటిని చేసినట్లయితే మంచి ఆదాయం ఉంటుంది పైగా శ్రమ ఉండదు.
రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు ఈ చపాతీ మేకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో చపాతీ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయవచ్చు. గంటకు 200 చపాతీలు తయారు చేసే మిషన్ ధర సుమారుగా 50వేల రూపాయలు ఉంటుంది. ఇలాంటి మెషిన్ అయితే మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. చపాతి పిండిలో జొన్నలు, రాగులు వంటి ఇతర ధాన్యాల పొడిలను కూడా కలిపి చపాతీలను తయారు చేసి మల్టీ గ్రెయిన్ చపాతీల పేరిట వీటిని అమ్మవచ్చు. ఒక్కో చపాతీ ధర 5 రూపాయలు నిర్ణయించిన రోజుకు రూ.1000 చపాతీలు విక్రయిస్తే 5000 రూపాయలు లభిస్తాయి ఈ లెక్కన చూసుకున్నట్లయితే 30 రోజులపాటు లక్ష రూపాయలను సంపాదించవచ్చు.