వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తో ఇన్నాళ్లు సంపాదించుకున్న పాపులారిటీ అంతా పోగొట్టుకున్నాడు బోయపాటి శ్రీను.. ఆ సినిమా రిలీజ్ సమయంలో మెగా ఫాన్స్ బోయపాటి ని దారుణంగా ట్రోల్ చేశారు. అందుకే కొంచెం టైం తీసుకుని మరీ బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు. అటు బాలకృష్ణ కు కూడా ఈ సినిమా చాలా అవసరం.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య..ఈ సారి ఇద్దరు గట్టిగ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..